Wednesday, May 11, 2016

Vaidehi Ashramam 23rd Annualday 2016: Secretary report by Sri.K.bala Krishnaiah , VSS

వైదేహి ఆశ్రమ 23 వ వార్షికోత్సవము
కార్యదర్శి నివేదిక:-                                                                        24th ఏప్రిల్ 2016
             వైదేహి ఆశ్రమ 23 వ వార్షికోత్సవమునకు విచ్చేసిన వేదికపైనున్న పెద్దలందరికి నమస్కారములు. సభయందున్న సోదర సోదరీ మణులకు సుస్వాగతము. ఆశ్రమం ప్రారంభమై 23సంవసరాలు పూర్తియై 24వ సంవత్సరము  ప్రారంభమైనది. ఈ  23సంవత్సరాల కాలములో 3 చిన్న గదుల నుండి ఈ విశాల 4 అంతస్తుల భవనంగా మారింది. ముగ్గురమ్మాయిల నుండి 109 మంది ప్రస్తుతం ఉన్నారు. 29 మందికి వివాహాలు జరిపించి అత్తగారింటికి పంపించడం జరిగింది. ఈ సంవత్సరము ముఖ్యంగా చెప్పుకోదగిన కొన్ని కార్యక్రమాలు మీ ముందుంచే ప్రయత్నము చేస్తాను.
1. జూన్ నెలలో ETV వారు ఆశ్రమమునకు విచ్చేసి బాలికల మొత్తం దినచర్య చిత్రీకరించి చాలా వివరాలు తమ చానల్ లో ప్రసారం చేశారు.
2. జూలై నెలలో వనితా TV వారు ఆశ్రమ బాలికల కార్యక్రమాలు, చదువు, ఆటలు, ఇతర వివరాలన్నీ చిత్రీకరించి ప్రసారం చేశారు.
3. డిసెంబర్ 15న 33వ పెండ్లి రోజు సందర్భంగా బ్రహ్మశ్రీ. గరికిపాటి నర్సింహారావుగారు ఆశ్రమమును సందర్శించి, ABN, ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం కార్యక్రమమంలో ఆశ్రమము గురించి చెప్పారు. పై మూడు కార్యక్రమాలు చూసి చాలా మంది ఔత్సాహికులు దేశంలోని అనేక పట్టణాల నుండి మరియు అమెరికా, జర్మనీ, జపాన్, కువైట్, దుబాయ్ లాంటి దేశాలలో గల తెలుగు వారు ఆశ్రమానికి ఫోన్ చేసి మీరు చాలా మంచి పని చేస్తున్నారని అభినందనలు తెలిపారు.
4. చిన్న పిల్లలను జూ పార్క్ కు తీసుకు వెళ్ళి అక్కడి జంతువులను ఇతర ప్రాణులను చూపించి బాలికలను ఆనందపరిచారు.
5. ఆగస్ట్ 15 న N.S.S. ఆర్గనైసషన్ ద్వారా వచ్చిన హై స్కూల్ విద్యార్థులతో కలిసి ఆశ్రమ బాలికలు స్వచ్ఛ భారత్ కార్యక్రమము నిర్వహించి మొత్తం ఆశ్రమ పరిసరాలు శుభ్రం చేశారు . స్వచ్ఛ భారత్ స్ఫూర్తి బాలికలకు కలిగించారు.
6. సెప్టెంబర్ 15న SBI బ్యాంక్ స్టాఫ్ మెంబర్స్ ఆశ్రమమును సందర్శించి బాలికలను ఆశీర్వదించి, Wet Grinder, Amplifier, సుమారు 50వేలు విలువగలవి అందించారు.
7. అక్టోబర్ 15న బాలికలను పెద్ద పిలలను భద్రాచలం తీసుకొని వెళ్లి శ్రీ సీతారాముల దర్శనం చేయించారు. పంచవటి, పాపికొండలు కూడా సందర్శించారు. ఒక దాత ఆర్ధికసహాయంతో ఈ విహారయాత్ర నిర్వహించారు.
8. జనవరి 9, 10న ఈ సంవత్సరం వైదేహి కిశోరి వికాస్ శిబిరం (RVK) రాష్ట్రీయ విద్యా కేంద్రం లో జరిగింది. సుమారు 950 మంది పాల్గొన్నారు. అఖిల భారత సహసర్ కార్యవాహ్ మా.శ్రీ.భాగయ్య గారు, పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు మార్గదర్శనం చేశారు.
9. జనవరి 16 న వైదేహి సర్వ సభ్య సమావేశం జరిగింది. రాబోవు 2 సంవత్సరాలకు వైదేహి ఆశ్రమం, వైదేహి కిశోరి వికాస్ మరియు వైదేహి మహిళా వికాస్ సమితులకు కొత్త కార్యవర్గ నియామకము జరిగింది.
10. ఈ సంవత్సరము 4 గురు ఆశ్రమ బాలికల పెళ్ళిళ్ళు జరిగాయి. జూన్ 11న సుప్రియ M.Tech వివాహం జరిగింది. డిశంబర్ 20న భువనేశ్వరి మరియు సత్యవాణిల ఇద్దరమ్మాయిల వివాహము జరిగింది. విశేషం ఏమనగా R.S.S. చీఫ్ పూజనీయ శ్రీ. మోహన్ జీ భాగవత్ గారు విచ్చేసి ఈ రెండు వివాహ జంటలను ఆశీర్వదించారు. సందర్శకుల పుస్తకములో వారు
पन्द्रह वर्ष पूर्व इस भवन के लोकार्पण में आया था भवन जिस कार्य  के लिये बना वह कार्य फलता - फूलता देखा बहुत आनंद का अनुभव कर रहा हूँ सभी कार्य कर्ता ओं को हर्दिक अभिनंदन तथा शुभकामनाएँ అని వ్రాశారు.

11. జనవరి 12న ఆశ్రమంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆశ్రమ బాలికలు, కాలనీలోని మహిళలు కూడా పాల్గొని శోభాయమానంగా కార్యక్రమము నిర్వహించారు.
12.డిసెంబర్ చివరి వారంలో సేవ భారతి యొక్క అఖిల భారత సంఘటనా కార్యదర్శి మా.శ్రీ.రాకేశ్ జైన్ గారు ఆశ్రమమును విచ్చేసి బాలికలకు మార్గదర్శనము చేశారు. కార్యవర్గ సభ్యులకు కొన్ని విలువైన సూచనలు తెలియ చేశారు.
13.మార్చ్ 2016 మొదటి వారంలో 45 మంది బాలికలు, 6గురు కమిటీ మెంబర్స్ తిరుపతి సందర్శించారు. ఒక దాత పుట్టిన రోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో ఈ విహార యాత్ర జరిగింది.
14. మార్చి చివరి వారంలో SBI deputy general manager, మరియు ఇతర బ్యాంకు అధికారులు  ఆశ్రమమునకు మహేంద్ర మినీ వ్యాన్, ప్రొజెక్టర్, ఫోటో ప్రింటర్ మొదలగు సామానులు అందచేశారు.
15.వైదేహి మహిళా వికాస సమితి ఈ సంవత్సరము 10 మంది గృహిణులకు (కౌన్సిలింగ్ ), 4 గురు కాలేజీ విద్యార్థులకు తాత్కాలిక వసతి, భోజనము ఏర్పాటు చేసినది. 

No comments:

Post a Comment