Monday, December 28, 2015

Tuesday, December 22, 2015

కలలు నెరవేర్చే ఒడి సనిరాశ్రయ బాలికలకు అండగా వైదేహి

కలలు నెరవేర్చే ఒడి సనిరాశ్రయ బాలికలకు అండగా వైదేహి

 నేడు ఇద్దరు యువతులకు 

వివాహాలు న్యూస్‌టుడే, ఐ.ఎస్‌.సదన్‌ అనాథ బాలికలకు తల్లి, తండ్రి, గురువు.. అన్నీ తామేగా మారి అండనిస్తోంది సైదాబాద్‌ సరస్వతీనగర్‌లోని వైదేహి అనాథశ్రమం..విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధి అవకాశాలు దక్కేలా చూడ్డంతోపాటు తగిన వయస్సురాగానే చక్కని పెళ్లి సంబంధాలు చూసి మెట్టినింటికీ పంపిస్తోంది. ఈ క్రమంలోనే ఆశ్రమంలో పెరిగి పెద్దయిన ఇద్దరు యువతులకు ఆదివారం వివాహాలు జరిపిస్తోంది. 

ముగ్గురితో ప్రారంభమై... 1993లో ఇక్కడి సరస్వతినగర్‌ శిశుమందిర్‌ పాఠశాలలో వైదేహి అనాథశ్రమం ప్రారంభమైంది. తల్లిదండ్రులు లేనివారు, ప్రమాదాలలో కుటుంబీకులను కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు. పెద్దలు విడిపోయి నిరాశ్రయులైన 59 ఏళ్ల బాలికలకు వైదేహి సేవా సమితి ఆధ్వర్యంలో ఆసరానిస్తున్నారు. ప్రస్తుతం 112 మంది ఉన్నారు.

క్రమశిక్షణ, సంప్రదాయాలు, దేశభక్తి, లక్ష్యాలు సాధించే దిశగా పాఠాలు చెబుతున్నారు. పదోతరగతి వరకు సరస్వతి శిశుమందిర్‌లోనే చదువు ఉంటుంది. మార్కులు, ఆసక్తిని బట్టి దాతల సాయంతో కళాశాలలకు పంపిస్తుంటారు. కన్నవారిగా నిలిచి ..పెళ్లి వయస్సు రాగానే ఆశ్రమ నిర్వాహకులు తగిన సంబంధాల కోసం అన్వేషిస్తారు. కొందరు మానవతా వాదులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చదువు పూర్తిచేసిన యువతులను వివాహాలు చేసుకుంటున్న సందర్భాలు అనేకం. అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి నేపథ్యాన్ని( ఉద్యోగం, అభిరుచులు తదితర) అన్ని రకాలుగా పరిశీలించి సంతృప్తి చెందిన పిదపే అమ్మాయిని చూపిస్తారు. ఇద్దరికీ నచ్చినట్లయితే వివాహం కుదుర్చుతారు. యూకె, చెన్నై, ముంబయిలలో చక్కగా స్థిరపడ్డ యువకులు సైతం తల్లిదండ్రులతో వచ్చి వివాహాలు చేసుకున్న దాఖలాలున్నాయి. ఆ కుటుంబాలు ఆనందంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. వారికి ఇప్పటికీ ఈ ఆశ్రమమే పుట్టినిల్లుగా ఉంటుంది. 

ఇక కన్యాదానం చేయాలని ఆసక్తి ఉన్న వారు ముందుకొస్తే నేపథ్యం పరిశీలించి అర్హత గల వారికి అవకాశం కల్పిస్తారు. వివాహ ఖర్చులు ఈ దాతలు భరిస్తుంటారు.

 శ్రీలక్ష్మితో మొదలై... ఆశ్రమంలో మొదటి వివాహం 2000లో శ్రీలక్ష్మి అనే యువతికి జరిగింది. ఇద్దరు పిల్లలతో గృహిణిగా సంతృప్తికర జీవితాన్ని గడుపుతోంది. అప్పటినుంచి గతయేడాది వరకు ఆశ్రమంలోని 25 మందికి తగిన వరులను ఎంపికచేసి దాతల సాయంతో వివాహాలు జరిపించారు. ఈ ఆదివారం కూడా రెండు వివాహాలను ఒకే వేదికపై నిర్వహించనున్నారు. 

ఇక్కడే చదువుకున్న సత్యవాణికి మల్లాపూర్‌లోని ఆలయంలో పనిచేసే యువకుడితో ఉదయం 11.20కుకు వివాహం జరగనుంది. ఈ యువకుడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కూడా. కన్యాదాతలుగా వేదుల విజయలక్ష్మి, వీర నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక 11.42కు భువనేశ్వరి అనే యువతికి శంషాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సంతోష్‌కుమార్‌తో వివాహం జరగనుంది. కన్యాదాతలుగా నేతి కిష్టమ్మ, ఫకీర్‌ యాదవ్‌లు వ్యవహరిస్తున్నారు. ఆశ్రమంలో ఎటుచూసినా సందడి కన్పిస్తోంది. మహిళలకు ఆర్థిక స్వావలంబన సీతాకుమారి, ఆశ్రమం ఉపాధ్యక్షురాలు ఆడపిల్ల అనగానే బతుకు భారం అని రోడ్డుపై పడేసేవారూ ఉన్నారు. ఎంతో బాధేస్తుంది. అలా చేసే బదులు ఆశ్రమానికి అప్పగిస్తే చక్కటి వాతావరణం కల్పించి విద్యాబుద్దులు నేర్పించి ఆదర్శ మహిళగా తీర్చిదిద్దుతాం. అలానే గృహహింస కారణంగా అసహాయులైన మహిళలకు తాత్కాలిక వసతి కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకూ కృషిచేస్తున్నాం. 

Source: http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/kalaluneraverche-odi-newsid-47518562

Thursday, December 17, 2015

Sri.Garikapati Narasimaha Rao gari Amrutha Bhashanamulu


Sri. garikapati Narasimha Rao vists of Ashramam on 16-12-2015, on the occasion of Marriage day of Sri.Garikapati Narasimha Rao and Smt.SharadaVaidehi Ashram Wedding Invitation:

We cordially inviting you with family and friends on the auspicious occasion of the marriage of the wards of Vaidehi Ashramam on Sunday, 20th December 2015.

1. Chi.Lax.Sow.Satyavani with Chi.Prashanth  at 11:25 a.m
   
                        &

2. Chi.lax.Sow.Bbhuvaneshwari with Chi.Santosh Kumar  at 11:42 a.m

at Vaidehi Ashramam Premises

Wednesday, December 16, 2015

16-12-2015 , సహస్రావధాని శ్రీ.గరికపాటి నరసింహారావు గారు మరియు ధర్మపత్నిశ్రీమతి శారద గారిచే వైదేహి సేవా సమితి website Launching Program :

సహస్రావధాని శ్రీ.గరికపాటి నరసింహారావు గారు మరియు ధర్మపత్నిశ్రీమతి శారద గారు కలిసి వైదేహి సేవా సమితి website :http://www.vaidehisevasamiti.org/ ని Launch చేశారు..
సహస్రావధాని శ్రీ.గరికపాటి నరసింహారావు గారు మరియు ధర్మపత్నిశ్రీమతి శారద గార్ల 33వ వివాహదినోత్సవ సందర్భంగా సైదాబాద్ కాలనీల్ లోని వైదేహి ఆశ్రమము నకు విచ్చేశారు

సహస్రావధాని శ్రీ.గరికపాటి నరసింహారావు గారు మరియు ధర్మపత్నిశ్రీమతి శారద గార్ల 33వ వివాహదినోత్సవ సందర్భంగా  సైదాబాద్ కాలనీల్ లోని వైదేహి ఆశ్రమము ( నిరాశ్రిత బాలికల వికాస గృహము) నకు విచ్చేసి దాదాపు 2 గంటల పాటు ఆశ్రమ బాలికలతొ గడిపి వారితో చిన్నారులతొ సహపంక్తి భోజనము చేశారు.మరియు ఆశ్రమ చిన్నారులను ఆశీర్వదించారు
వైదేహి అంటే సీత అని,సీత  ధైర్యంగా  కష్టాలను ఎదురుకొనె మనోధైర్యం గల స్ర్తీ  అని, ఆడపిల్లలందరు   ఎన్నడు ధైర్యాన్ని విడనాడరాదని వారికి ఉద్భోదించారు.
వైదేహి సేవా సమితి కి సంబంధించిన వైబ్ సైట్ ను ప్రారంభించారు. వైదేహి ఆశ్రమ కార్యవర్గ సభ్యులు శ్రీ .బాలకృష్ణయ్య,శ్రీ.ఫి.ప్రకాష్ రావు,శ్రీ.కె.వెంకటేశ్వర్లు, శ్రీమతి సీతా కుమారి గారు మరియు ఇతర కమిటీ సభ్యులు , దాతలు ఈ కార్యక్రమములొ పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేశారు.