Tuesday, December 22, 2015

కలలు నెరవేర్చే ఒడి సనిరాశ్రయ బాలికలకు అండగా వైదేహి

కలలు నెరవేర్చే ఒడి సనిరాశ్రయ బాలికలకు అండగా వైదేహి

 నేడు ఇద్దరు యువతులకు 

వివాహాలు న్యూస్‌టుడే, ఐ.ఎస్‌.సదన్‌ అనాథ బాలికలకు తల్లి, తండ్రి, గురువు.. అన్నీ తామేగా మారి అండనిస్తోంది సైదాబాద్‌ సరస్వతీనగర్‌లోని వైదేహి అనాథశ్రమం..విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధి అవకాశాలు దక్కేలా చూడ్డంతోపాటు తగిన వయస్సురాగానే చక్కని పెళ్లి సంబంధాలు చూసి మెట్టినింటికీ పంపిస్తోంది. ఈ క్రమంలోనే ఆశ్రమంలో పెరిగి పెద్దయిన ఇద్దరు యువతులకు ఆదివారం వివాహాలు జరిపిస్తోంది. 

ముగ్గురితో ప్రారంభమై... 1993లో ఇక్కడి సరస్వతినగర్‌ శిశుమందిర్‌ పాఠశాలలో వైదేహి అనాథశ్రమం ప్రారంభమైంది. తల్లిదండ్రులు లేనివారు, ప్రమాదాలలో కుటుంబీకులను కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు. పెద్దలు విడిపోయి నిరాశ్రయులైన 59 ఏళ్ల బాలికలకు వైదేహి సేవా సమితి ఆధ్వర్యంలో ఆసరానిస్తున్నారు. ప్రస్తుతం 112 మంది ఉన్నారు.

క్రమశిక్షణ, సంప్రదాయాలు, దేశభక్తి, లక్ష్యాలు సాధించే దిశగా పాఠాలు చెబుతున్నారు. పదోతరగతి వరకు సరస్వతి శిశుమందిర్‌లోనే చదువు ఉంటుంది. మార్కులు, ఆసక్తిని బట్టి దాతల సాయంతో కళాశాలలకు పంపిస్తుంటారు. కన్నవారిగా నిలిచి ..పెళ్లి వయస్సు రాగానే ఆశ్రమ నిర్వాహకులు తగిన సంబంధాల కోసం అన్వేషిస్తారు. కొందరు మానవతా వాదులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చదువు పూర్తిచేసిన యువతులను వివాహాలు చేసుకుంటున్న సందర్భాలు అనేకం. అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి నేపథ్యాన్ని( ఉద్యోగం, అభిరుచులు తదితర) అన్ని రకాలుగా పరిశీలించి సంతృప్తి చెందిన పిదపే అమ్మాయిని చూపిస్తారు. ఇద్దరికీ నచ్చినట్లయితే వివాహం కుదుర్చుతారు. యూకె, చెన్నై, ముంబయిలలో చక్కగా స్థిరపడ్డ యువకులు సైతం తల్లిదండ్రులతో వచ్చి వివాహాలు చేసుకున్న దాఖలాలున్నాయి. ఆ కుటుంబాలు ఆనందంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. వారికి ఇప్పటికీ ఈ ఆశ్రమమే పుట్టినిల్లుగా ఉంటుంది. 

ఇక కన్యాదానం చేయాలని ఆసక్తి ఉన్న వారు ముందుకొస్తే నేపథ్యం పరిశీలించి అర్హత గల వారికి అవకాశం కల్పిస్తారు. వివాహ ఖర్చులు ఈ దాతలు భరిస్తుంటారు.

 శ్రీలక్ష్మితో మొదలై... ఆశ్రమంలో మొదటి వివాహం 2000లో శ్రీలక్ష్మి అనే యువతికి జరిగింది. ఇద్దరు పిల్లలతో గృహిణిగా సంతృప్తికర జీవితాన్ని గడుపుతోంది. అప్పటినుంచి గతయేడాది వరకు ఆశ్రమంలోని 25 మందికి తగిన వరులను ఎంపికచేసి దాతల సాయంతో వివాహాలు జరిపించారు. ఈ ఆదివారం కూడా రెండు వివాహాలను ఒకే వేదికపై నిర్వహించనున్నారు. 

ఇక్కడే చదువుకున్న సత్యవాణికి మల్లాపూర్‌లోని ఆలయంలో పనిచేసే యువకుడితో ఉదయం 11.20కుకు వివాహం జరగనుంది. ఈ యువకుడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కూడా. కన్యాదాతలుగా వేదుల విజయలక్ష్మి, వీర నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక 11.42కు భువనేశ్వరి అనే యువతికి శంషాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సంతోష్‌కుమార్‌తో వివాహం జరగనుంది. కన్యాదాతలుగా నేతి కిష్టమ్మ, ఫకీర్‌ యాదవ్‌లు వ్యవహరిస్తున్నారు. ఆశ్రమంలో ఎటుచూసినా సందడి కన్పిస్తోంది. మహిళలకు ఆర్థిక స్వావలంబన సీతాకుమారి, ఆశ్రమం ఉపాధ్యక్షురాలు ఆడపిల్ల అనగానే బతుకు భారం అని రోడ్డుపై పడేసేవారూ ఉన్నారు. ఎంతో బాధేస్తుంది. అలా చేసే బదులు ఆశ్రమానికి అప్పగిస్తే చక్కటి వాతావరణం కల్పించి విద్యాబుద్దులు నేర్పించి ఆదర్శ మహిళగా తీర్చిదిద్దుతాం. అలానే గృహహింస కారణంగా అసహాయులైన మహిళలకు తాత్కాలిక వసతి కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకూ కృషిచేస్తున్నాం. 

Source: http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/kalaluneraverche-odi-newsid-47518562

No comments:

Post a Comment