Saturday, May 20, 2017

Vaidehi Ashramam 24th Annualday 2017: Secretary Report by Sri.K.Balakrishnaiah garu, VSS


వైదేహి సేవా సమితి 24 వ వార్షికోత్సవము
కార్యదర్శి నివేదిక:-                                                                   30th ఏప్రిల్ 2017
వైదేహి ఆశ్రమ 24 వ వార్షికోత్సవమునకు విచ్చేసిన వేదికపైనున్న పెద్దలందరికి నమస్కారములు. సభయందున్న సోదర సోదరీ మణులకు సుస్వాగతము. ఆశ్రమం ప్రారంభమై 24సంవసరాలు పూర్తియై 25వ సంవత్సరము  ప్రారంభమైనది. ఈ  24సంవత్సరాల కాలములో 3 చిన్న గదుల నుండి ఈ విశాల 4 అంతస్తుల భవనంగా మారింది. ముగ్గురమ్మాయిల నుండి 109 మంది ప్రస్తుతం ఉన్నారు. 34 మందికి వివాహాలు జరిపించి అత్తగారింటికి పంపించడం జరిగింది. ఈ సంవత్సరము ముఖ్యంగా చెప్పుకోదగిన కొన్ని కార్యక్రమాలు మీ ముందుంచే ప్రయత్నము చేస్తాను.
తల్లి దండ్రుల ప్రేమకు నోచుకోని నిరాశ్రిత బాలికలను చేరదీసి వారిని పెంచి, పోషించి, సంస్కారము, క్రమశిక్షణ, దైవభక్తి, దేశభక్తి గల్గిన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు వారసులుగా తీర్చిదిద్దుట, నిరుపేదలైన యువతులను, మహిళలను చేరదీసి వారి మానసిక, ఆర్ధిక పరిస్ధితి మెరుగు పరుచుట సేవాసమితి ప్రధాన లక్ష్యం.
వైదేహి సేవాసమితి ఆధ్వర్యంలో     1. వైదేహి ఆశ్రమము
                                                  2. వైదేహి కిశోరి వికాస యోజన
                                                  3. వైదేహి మహిళా వికాస సమితి
                                                  4.  వైదేహి సంచార వైద్యశాల
విడివిడిగా ప్రత్యేక నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి నిర్వహించుచున్నది.

వైదేహి ఆశ్రమము : 1993లో 3 చిన్న గదుల తాత్కాలిక వసతి గృహంలో ముగ్గురు బాలికలతో ప్రారంభమై వదాన్యుల సహకారంతో నేడు 150 మంది బాలికలకు ఆశ్రయం ఇవ్వగల సొంత భవనమును ఏర్పరుచుకొన్నది.
ప్రస్తుత౦ వైదేహి ఆశ్రమంలో 96 మంది బాలికలు ఉన్నారు.
            -  64 శ్రీ సరస్వతి శిశుమందిర్ లో - పదవ తరగతి వరకు చదువుతున్నారు. ఈ సంవత్సరము10 వ తరగతి పరీక్ష రాసినారు..
            32 మ౦ది కాలేజి విధ్యార్థునులు
 ఇప్పటి వరకు 34  మందికి వివాహాలు జరిగాయి. స౦వత్సర౦ ఇద్దరు అమ్మాయిలకి వివాహము చేయడము జరిగినది.  ఆగస్ట్ 14th న సాయిరత్న వివాహ౦ రమేశ్ పాత్ర, Software Engineer తో జరిగినది. అదేవిధoగా నవంబర్ 25న అపర్ణ వివాహము రాము, Software Engineer తో జరిగినది.
·         ఆశ్రమ బాలికలు  చదువుతో పాటూ, సంగీతము, యోగ, డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. Science quiz, అభినయ గేయ౦, స౦గీత౦, పేయి౦టి౦గ్ లలో పాల్గొని బహుమతులు పొ౦దారు. సెలవులలో క్యాండిల్స్, షాంపూ, క్లాత్ పేయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్, ఫ్లవర్ పాట్స్ తయారు చేస్తారు.
            సంవత్సరము 15,000 మంది వైదేహి ఆశ్రమమును వివిధ సందర్భాల్లో సందర్శించారు. వీరిలో 5000 మంది             దాతలున్నారు.
ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖులు:
·         శ్రీ జస్టిస్ C V N శాస్త్రి గారు , జడ్జి - High Court of A.P
·         శ్రీమతి. నిర్మల గారు ,తెలoగాణ సoయుక్త కార్యదర్శి, సచివాలయము 
·    శ్రీ శ్రీ శ్రీ  స్వామీజీ పుష్పరంజన్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు వారి శిష్యులు - (స్వామీజీ పుట్టిన రోజు సందర్భంగా)
·         Dr. లక్ష్మణ్ గారు, Telangana- BJP President, తన 60వ పుట్టిన రోజు
·        BJP తెల౦గాణ శాసన సభపక్ష నేత & అంబర్ పేట MLA శ్రీ. G. కిషన్ రెడ్డి గారు & M.L.C శ్రీ. Dr.P. రాజేశ్వర్ రెడ్డిగారు (సాయిరత్న వివాహము)
·         శ్రీ. పవన్ కుమార్ శర్మ గారు, MSIT, LLM, Advocate
·         శ్రీ. ఆనంద్ ప్రకాశ్ గోయల్ – కేoద్ర సహోయ మoత్రి , విశ్వ హిందు పరిషత్
·         శ్రీ, S. ప్రకాశ్ వెలిహ్, Ex. Educational Minister of GOA, & BJP వైస్-President
·         శ్రీ. ముక్తేశ్వర రావు గారు, తిరుమల దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ & కలెక్టర్ వచ్చారు.
విద్యావిహార యాత్రాలు:
Ø  మే 19, 2016 నుoడి 29th వరకు 30 మంది పిల్లలు వందేమాతరం ఫౌండేషన్ వారు నిర్వహించిన 10 రోజుల క్యాంప్ అక్షరవనo, కల్వకుర్తి కి వెళ్ళి, వేద గణితం, Personality Development skills నేర్చుకున్నారు.
Ø  తెలంగాణ టూరిజం వారి సహకారంతో జూన్ 4 2016 న ఆశ్రమ బాలికలను వరoగల్ టూర్ – రామప్ప దేవాలయము, వెయ్యి స్థoబాల గుడి, భద్రకాళి దేవాలయము, లక్నవరo చెరువు మొదలైన స్థలములు సందర్శించి వచ్చారు.
Ø  అక్టోబర్ 29 2016న, దీపావళి పoడుగ సందర్భoగా 30 మoది పిల్లలు, 6 గురు కమిటీసభ్యులు రాజభవన్ కి వెళ్ళి, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్  శ్రీ.నరసింహన్ గారి కలిసారు. గవర్నర్ గారు తమ ఆశీర్వచనాలను పిల్లలకు అందచేశారు.
Ø  12-01-2017 న సంక్రాoతి పండుగ సందర్భoగా ఆశ్రమములో ముగ్గుల పోటీలు నిర్వహిoచారు.
Ø  20-01-2017 , 60oది పిల్లలు ,మాతాజీలు  & కమిటీ సభ్యులు హైద్రాబాద్ లోకల్ టూర్ లుంబిని పార్క్ , టాంక్ బoడ్, గోల్కొండ కోట కి తీసుకెళ్లారు.
సమావేశాలు
·         30-01-2017 న వైదేహి సంచార వైద్యశాల సమావేశము జరిగినది.
·         8-3-2017 న రవీoద్ర భారతిలో జరిగిన women & Child welfare meeting కి ఆశ్రమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
·         వైదేహి సేవా సమితి సర్వ సభ్య సమావేశములు -
            వైదేహి సేవా సమితి సర్వ సభ్య సమావేశము (సంస్ధాపక మండలి) - ఈ స౦వత్సర౦ 22-04-2017న జరిగినది.
ప్రతీ నెల మొదటి శనివారం ఆశ్రమ Executive body meeting మరియు మొదటి ఆదివార౦ కిశోరి వికాస యోజన కే౦ద్రాల నిర్వహకుల శిక్షణా తరగతుల meeting జరుగుతుంది.
వైద్య సేవలు
            శ్రీ.డా.విజయ కుమార్ గారు మరియుశ్రీ. డా.సతీష్ రెడ్డి గారు  ప్రతి ఆదివారము వచ్చి పిల్లలకి వైద్య సహాయము అందిస్తున్నారు. శ్రీమతి.డా.ఉమాదేవి , శ్రీ.డా.శ్రీనివాస్  చీదెళ్ళ , శ్రీ.డా.శ్రీధర్ గారు , శ్రీమతి.డా.సువర్ణ గారు, శ్రీ.డా.నగేశ్ గార్లు, పాననీయ డే౦టల్ కళాశాల, సబితా నర్సీ౦గ హోమ్ వాళ్ళు పిల్లల కు  వైద్య సహాయము అ౦దిస్తున్నారు.
 ఉత్సవాలు, పండగలు
      సంక్రాంతి నాడు ముగ్గుల పోటీలు జరిగాయి. 15 ఆగస్టు నాడు ఆటలు, శారీరక్, బౌద్ధిక్ అంశాలపైన పోటీలు జరిపి బహుమతి ప్రదానం గావించబడింది, జనవరి 26, ఘనంగా జరుపుకొన్నాము.
            వైదేహి ఆశ్రమoలో అనఘా వ్రతo, రాఖీ పౌర్ణమి ఉత్సవాలు జరిగాయి.        
భారత్ వికాస్ పరిషత్ మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహి౦చిన దేశభక్తి , జాతీయ గీతాల పోటీల్లో పిల్లలు  పాల్గొని బహుమతులు అ౦దుకున్నారు.
            Capgemini software company, Youth For Seva అధ్వర్యoలో నారాయణమ్మ ఇoజనీరిoగ్ & Gandhi Hospital -Exhibition stall లో నిర్వహిoచిన, కార్యక్రమములో బాలికలచే తయారు చేసిన వస్తువులు ప్రదర్శనకు ఉ౦చారు. అక్కడికి వచ్చిన వాళ్ళు మన పిల్లలు చేసిన వస్తువులను కునుగోలు చేశారు.
వైదేహి కిషోరి వికాస యోజన:
 బాలికాభ్యుదయమే దేశాభ్యుదయం ఈ భావనతోనే వైదేహి సేవా సమితి తమ సేవలను కేవలం ఆశ్రమ బాలికలకు మాత్రమే పరిమితం చేయకుండా, పేద బస్తిలోని ఆడపిల్లల జీవితాల్లో వికాసం తీసుకురావడమే లక్ష్యంగా జనవరి 2005 సం"లో ఈ ప్రకల్పం ప్రారంభించబడింది. బస్తీలలోని 11 సం"ల నుండి 18 సం"ల వయస్సు కలిగిన అమ్మాయిల కొరకు ప్రతీరోజు 2గం"ల సమయాన్ని వెచ్చించే మహిళా కార్యకర్తల ద్వారా ఈ కిశోరి కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కేంద్రాలకు వచ్చే బాలికలకు విద్య, ఆరోగ్యం, సంస్కారం, స్వావలంబన అనే నాలుగు అంశాలపై పటిష్టమైన శిక్షణ ఇవ్వడమే ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశ్యము.
ప్రస్తుతం భాగ్యనగరంలో 63 కేంద్రాలు సమర్ధవంతంగా నిర్వహించబడుతున్నాయి.దీని ద్వారా సుమారు 1600 మంది బాలికలు శిక్షణ పొందుతున్నారు.
వైదేహి మహిళా వికాస సమితి:
అనాధలైన మహిళలకు వసతి, రక్షణ, స్వశక్తితో సమాజంలో నిలబడగల ధైర్యం కలిగించటమే వికాస సమితి యొక్క ముఖ్య ఉద్దేశ్యము వృత్తి విద్యలు నేర్పించి, ఆత్మస్ధైర్యంతో వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయూతనివ్వడం జరుగుచున్నది.
            భార్యాభర్తలు మధ్య, అత్త, మామల గొడవ వలన వచ్చే సమస్యలను, తల్లిద౦డ్రుల నిశ్చయి౦చిన వివాహ౦ ఇష్ట౦ లేక వచ్చిన మహిళల సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తున్నారు. అనాధ మహిళ బాలికలకు సహాయమందిస్తున్నారు. గత స౦. ర౦లో 9  మ౦ది మహిళలకు కౌన్సిలి౦గ్, పోలీస్ హెల్ప్, లీగల్ హెల్ప్ అందించి వారిని తిరిగి వారి, వారి కుటుoబాలలో సుస్థిర నివాసం కల్పించారు.
వైదేహి సంచార వైద్యశాల:
            వైదేహి సేవా సమితి కమిటి వారి సూచన మేరకు 19-12-2016 నుండి వైదేహి సంచార వైద్య శిబిరము L.B.నగర్ కార్పొరటర్ వారిచే NTR నగర్ బస్తీలో ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు శ్రీయుతులు బాలకృష్ణయ్య గారు, సంఘ పెద్దలు మల్లిఖార్జున్ జీ తదితరులు హాజరయినారు. సోమవారము నుండి శనివారము వరకు రోజు సాయంత్రం 5 గం.ల నుండి 7 గంటల వరకు ఒక 6 బస్తీలు, (1).NTR నగర్, (2).భగత్ సింగ్ నగర్ కాలనీ, (3).సింగరేణి కాలనీ, (4).చంద్రయ్య గుడిసెలు, (5).భూలక్ష్మి నగర్, (6).ఇందిరా నగర్, చైతన్యపురి తదితర కాలనీలలో ఈ కార్యక్రమము జరుగుచున్నది.
            ఈ కార్యక్రమమునకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక డీసిల్ వ్యాన్ సమకూర్చటం జరిగినది.
            సంచార వైద్య శిబిరము యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా ఈ రోజులలో వైద్యము చాలా ఖర్చుతో కూడుకునియున్నది. కనీస వైద్యము కూడా సామాన్య ప్రజలు చేయించుకోలేని స్థితి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సంచార వైద్య శిబిరము ప్రారంభించుట జరిగినది.ఈ వైద్య శిబిరములలో ఇద్దరు MBBS డాక్టర్లు మరియు వ్యాన్ డ్రైవర్ పనిచేయుచున్నారు. వారికి గౌరవ వేతనము ఇవ్వటం జరుగుచున్నది. శిబిరమునకు కావలసిన మందులు అన్నియు జనరిక్ మందుల షాపులో కొనటం జరుగుచున్నది.ఇంతకు ముందు చెప్పిన 6 బస్తీలలో ప్రజలు సంచార వైద్యశాల పట్ల మంచి ఆదరణ చూపుతూ వారి అవసరాలు తీర్చుకొనుట జరుగుచున్నది.

            వైదేహి సేవాసమితికి ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖవారిచే గుర్తింపు ఉన్నది. దాతలు ఇచ్చిన విరాళములకు ఆదాయపు పన్నువారిచే  80 జి ద్వారా పన్ను మినహాయింపు ఉన్నది  విదేశీ విరాళములకు FCRA ద్వారా కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్నది.
        ఇంకను వైదేహి సేవా సమితి కార్యక్రమాలు విస్తరించాల అనే ఉద్దేశ్య౦తో ఈ స౦. ర౦ నాదరగుల్ లో ఒక ఎకర౦ స్థల౦ సేకరి౦చాము. దానిలో వృత్తి విద్యా కే౦ద్రము / పారిశ్రామిక శిక్షణా స౦స్థలా౦టీవి పెట్టాలని నిర్ణయం జరిగింది. భావనా నిర్మాణ కమిటీ కూడా నిర్ణయమయినది. పని ప్రారంభమైనది. పవిత్ర కార్యనిర్వహణలో మీ అందరు ఇక ముందు కూడా ఇలాగే  సహాయ సహకారములను అందించి,  వైదేహి బాలికలను ఆశీర్వదించగలరని ప్రార్ధన .

                                                            ధన్యవాదములు

                                               


            


Vaidehi Ashramam 24th Annualday Celebration Photo Gallary